![]() |
![]() |
.webp)
ప్రేమికుల రోజున ఎంతోమంది సెలెబ్రిటీలు తమ లైఫ్ లో జరిగిన ఎన్నో అనుభవాలని షేర్ చేసుకున్నారు. కొంతమంది పెళ్ళి తర్వాత కూడా వారి మధ్య ప్రేమ ఉండటానికి కారణమేంటో ? ఆ సీక్రెట్ షేర్ చేసుకుంటున్నారు. వాటిని షేర్ చేసుకుంది ఎవరో కాదు సుమ కనకాల.
బుల్లితెర స్టార్ మహిళ సుమ కనకాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన మాటలతో స్టార్ హీరోలని, డైరెక్టర్ లను సైతం మెప్పిస్తూ యాంకరింగ్ లో కొత్త ఒరవడిని సృష్టించింది. ఎంతమందిలో ఉన్నా.. ఏ స్టేజ్ మీద అయినా తన మాటలతో మెస్మరైజ్ చేస్తూ అనర్గళంగా మాట్లాడుతుంది సుమ. స్పాంటేనియస్ కామెడీ పంచ్ లతో ఎప్పుడు ఆకట్టుకునే సుమ.. సోషల్ మీడియాలో కూడా తన ప్రతిభని కనబరుస్తుంది. తన యూట్యూబ్ ఛానెల్ లోను వీడియోలు చేస్తూ బిజీగా ఉంటుంది సుమ. తన యూట్యూబ్ ఛానెల్ ని స్టార్ట్ చేసి అందులో కొన్ని టిప్స్ ఇస్తూ వీడియోలు కూడా చేస్తుంది. రీసెంట్ గా మహిళల కోసం ఒక వీడియోని చేసి మహిళలకి విలువైన టిప్స్ ని ఇచ్చింది సుమ. తనకు తోచినదే కాకుండా మహిళలకి ఎలా ఉండాలో కొన్ని కొత్త ఐడియాలని ఇస్తూ ఎంతోమందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తోంది.
సుమ, రాజీవ్ కనకాల ఇద్దరికి పెళ్ళి జరిగి 25 సంవత్సరాలు అవుతుందంట. అదే విషయాన్ని నిన్నటి ప్రేమికుల రోజున చెప్తూ వారి అనుబంధం ఇన్ని సంవత్సరాలు ఇలా హ్యాపీగా ఉండటానికి గల కారణాలు, సీక్రెట్స్ చెప్పుకొచ్చారు. ఇదంతా ఓ వ్లాగ్ లో చెప్పుకొచ్చింది సుమ. పెళ్ళి తర్వాత ఇంత సంతోషంగా ఉండటానికి కారణమేంటని రాజీవ్ ని అడుగగా.. మనల్ని నమ్ముకొని ఎన్నో ఆశలతో వారి ఇంటి నుండి మన ఇంటికి కోడలిగా వస్తుంది. అన్నీ వదిలేసుకొని వచ్చిన ఆమెకి మనం కాస్త టైమ్ ఇవ్వాలి. మొదట టైమ్ ఇస్తే చాలు ఆ తర్వాత వాళ్ళే తన్ని తరిమేస్తారని రాజీవ్ చెప్పగా.. ఇదంతా మీరు అనుభవించి చెప్తున్నట్టుగా ఉందని నవ్వుతూ చెప్పేసింది సుమ. మీకిష్టమైన భోజనం ఏంటని అడుగగా.. పులిహోర, గుమ్మడి కాయ పులుసు, పెరుగు చట్నీ అంటూ రాజీవ్ అన్నాడు. సినిమాకి వెళ్ళాలని మీరెప్పుడైన గొడవ పడ్డారా అని ఒకరు అడుగగా.. సినిమాకి వెళ్ళాలని కాదు కానీ నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు మమ్మీ, వైరస్, దెయ్యాల కోట లాంటి హారర్ సినిమాలకి తీసుకెళ్ళేవాడు అవి వద్దని నేనే రాజీవ్ తో గొడవ పెట్టుకున్నానని సుమ అంది. మీ హస్బెండ్ ఫోన్ ఎప్పుడైన చెక్ చేసారా అని ఒకరు అడుగగా.. ఎస్.. తనకి తెలియకుండా ఓ పది సంవత్సరాల క్రితం చెక్ చేశాను కానీ అందులో ఏమీ దొరకలేదని సుమ అంది. మీ హస్బెండ్ ఫేవరెట్ కలర్ రెడ్ అని ఒకరు అడుగగా.. నో ఇట్స్ బ్లాక్ అని సుమ అనగా రైట్ అని రాజీవ్ అన్నాడు. ఇలా కొన్ని ఆసక్తికరమైన క్వశ్చన్స్ ని యూట్యూబ్ సబ్ స్క్రైబర్స్ వారిని అడుగగా సుమ, రాజీవ్ ఇద్దరు సమాధానలిచ్చారు. కాగా ఈ క్వశ్చనింగ్ ని వ్లాగ్ రూపంలో తమ యూట్యూబ్ ఛానెల్ లో సుమ అప్లోడ్ చేసింది. అది ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.
![]() |
![]() |